ఆమె జ‌బ‌ర్‌ద‌స్తే కానీ జ‌బ‌ర్‌ద‌స్త్‌కి కాదు!

Hari Teja rubbishes rumors about Jabardasth show
Thursday, October 12, 2017 - 14:45

ఒక సినిమా, ఒక టీవీ షో.. హ‌రితేజ‌ని ఓవ‌ర్‌నైట్ స్టార్‌ని చేశాయి. అ ఆ సినిమాలో ప‌నిపిల్ల క్యార‌క్ట‌ర్‌తోనే హ‌రితేజ ఎంతో పాపుల‌ర్ అయింది. ఆ పాపులారిటీ వ‌ల్లే ఆమె బిగ్‌బాస్ షోలో కాంటెస్టెంట్ అయింది. ఇక బిగ్‌బాస్‌లో ఈ భామ మామూలుగా అద‌ర‌గొట్ట‌లేదు.

త‌న మాట తీరు, త‌న చేష్ట‌ల‌తో అంద‌రి అభిమానాన్ని చూర‌గొంది. ఒక ద‌శ‌లో బిగ్‌బాస్ విన్న‌ర్‌గా హ‌రితేజ నిలుస్తుంద‌నిపించింది. ఈ రేంజ్‌లో ఆమెకి పాపులారిటీ రావ‌డంతో ఆమె చుట్టూ స్పెక్యులేష‌న్స్ మొద‌ల‌య్యాయి. జ‌బ‌ర్‌ద‌స్త్ అనే కార్య‌క్రమానికి ఇక హ‌రితేజ హోస్ట్ అవుతుంద‌నేది కొత్త ప్ర‌చారం వ‌చ్చింది. ర‌ష్మీ స్థానంలో ఇక హ‌రితేజ రానుంద‌ని యూట్యూబ్ గాసిప్ చానెళ్లు, వెబ్‌సైట్‌లు హోరెత్తించాయి.

తీరా తేలిందేమిటంటే ఈ అమ్మ‌డు జ‌బ‌ర్‌ద‌స్త్ న‌టినే కానీ ఆమెని జ‌బ‌ర్‌ద‌స్త్‌కి యాంక‌ర్‌గా తీసుకోవ‌డం లేద‌ట‌. త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌ని ఊరించే ర‌ష్మి ఆ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా కంటిన్యూ అవుతుంద‌ట‌.