పవన్ ను నేను అలా చూడను

Harish Shankar says he's fan of Pawan Kalyan
Friday, April 17, 2020 - 19:30

త్వరలోనే మరోసారి పవన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు హరీష్ శంకర్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. అలా గబ్బర్ సింగ్ మేజిక్ మరోసారి రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు హరీష్. ఈ క్వారంటైన్ గ్యాప్ లో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన హరీష్.. పవన్ తో చేయబోయే సినిమాపై సూటిగా స్పందించాడు.

"పవన్ సినిమా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. నేనెప్పుడు పవన్ ను దర్శకుడి కోణంలో చూడను. ఓ ఫ్యాన్ గానే పవన్ ను చూస్తాను. పవన్ తో చేయబోయే సినిమాలో ఫ్యాన్స్ ఆయన నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఉంటాయి. పవన్ పై అభిమానాన్ని మరింత పెంచేలా నా సినిమా ఉంటుంది."

ఇలా పవన్ సినిమాపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు హరీశ్. మాస్ పల్స్ బాగా తెలిసిన ఈ దర్శకుడు.. గబ్బర్ సింగ్ సినిమాను అలానే తీశాడు. పేరుకు రీమేక్ అయినప్పటికీ.. ఫ్యాన్స్ పవన్ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆలోచించి అవన్నీ అందులో పెట్టాడు. త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ హీరోగా చేయబోయే సినిమాను కూడా ఓ దర్శకుడిగా కాకుండా, ఓ  ఫ్యాన్ గా ఆలోచించి తీస్తానంటున్నాడు.