హ‌రీష్ రెడీ, మ‌రి మెగాస్టార్‌?

Harish Shankar says he's prepared story for Chiranjeevi
Thursday, June 29, 2017 - 14:45

మెగాస్టార్ చిరంజీవి అమెరికా వెళ్లాడు. ఆయ‌న భార్య సురేఖ‌తో క‌లిసి ఇపుడు విదేశీ టూర్లు వేస్తున్నాడు. త‌న త‌దుప‌రి చిత్రం రెగ్యుల‌ర్ ప్రారంభం అయ్యేందుకు ఇంకా టైముంది. ఈ గ్యాప్‌లో ఆయ‌న టూరిస్ట్‌గా మారారు. అన్ని దేశాలు చుట్టి వ‌స్తున్నారు. మ‌రోవైపు, చిరంజీవితో 152వ సినిమా చేసేందుకు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి క్యూలో ఉన్నాడు. ఈ లోపు చిరంజీవికి సరిపడే కథ నా దగ్గర ఉంది, ఆయ‌నతో సినిమా చేసేందుకు నేను రెడీ అంటూ డీజే డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ అంటున్నాడు.

"గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా నా స్ట‌యిల్ సినిమా క‌దా. అలాంటి సినిమా కోస‌మే నేను వెయిట్ చేస్తున్నా..." అంటూ ఆ మ‌ధ్య మెగాస్టార్ త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టాడు. అప్ప‌టికి చిరంజీవి రీ ఎంట్రీ జ‌ర‌గ‌లేదు. అయితే, ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా సూప‌ర్‌హిట్ అయిన త‌ర్వాత చిరంజీవితో సినిమా చేసేందుకు నేటి త‌రం బ‌డా ద‌ర్శ‌కులు కూడా క్యూ క‌డుతున్నారు. సో.. చిరుకి ఇపుడు ఆప్స‌న్స్ చాలా ఉన్నాయి. 

చిరంజీవికి తాను క‌థ రెడీ చేశాన‌ని అంటున్నాడు హ‌రీష్‌. "గ్యాంగ్‌ లీడర్‌’, ‘దొంగమొగుడు’, ‘రౌడీఅల్లుడు’ చిత్రాల తరహాలో ఆ సినిమా కొత్తకోణంలో సాగుతుంది. చిరంజీవి 150వ చిత్రం గురించి చెప్పుకున్నట్టే మా కాంబినేష‌న్లో వ‌చ్చే చిత్రం గురించీ గొప్పగా చెప్పుకోవాలనేది ఆశ..." అంటూ హ‌రీష్ ఆల్రెడీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక చిరు డేట్స్ ఇవ్వాలి మ‌రి. ఈ కాంబో ఆఫ‌ర్ ఎపుడు ఉంటుందో!