హరీష్ సినిమాలు, వెబ్ సిరీస్లు

Harish Shankar turning producer
Sunday, June 21, 2020 - 12:30

పంచ్ డైలాగ్ లకు పెట్టింది పేరు హరీష్ శంకర్. ఆయన సినిమాల్లో హీరోలే కాదు, రియల్ లైఫ్ లో అతడు కూడా పంచ్ డైలాగులు చెబుతుంటాడు. ఇప్పుడీ దర్శకుడు నిర్మాతగా మారబోతున్నాడు. కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత తన బ్యానర్ ను ఎనౌన్స్ చేయబోతున్నాడు.

ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా స్థిరపడిన మహేష్ కోనేరుతో పాటు మరికొందరితో కలిసి కొత్త బ్యానర్ స్థాపించాలనుకుంటున్నాడు హరీష్ శంకర్. ఈ మేరకు ప్రయత్నాలు కొలిక్కివస్తున్నాయి. ఇంతకుముందు తెలుగుసినిమా.కామ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని  వెబ్ సిరీస్లు నిర్మించబోతున్నట్లు చెప్పాడు హరీష్. ఇప్పుడు వెబ్ సిరీస్లతో పాటు సినిమాలు కూడా నిర్మిస్తాడట. 

ప్రణీత్ అనే కుర్రాడికి తన బ్యానర్ లో ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట హరీష్. గతంలో కొణెదల నిహారిక హీరోయిన్ గా "సూర్యకాంతం" అనే సినిమా తీసిన దర్శకుడు ఇతడే. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా హరీష్ శంకర్ నిర్మాణంలో ఓ క్రైమ్-కామెడీ సినిమా చేయబోతున్నాడు.