చార్మికి మెంటలా?

Has Charmee gon made?
Monday, March 2, 2020 - 18:15

ఛార్మికి మెంటలా అంటూ సోషల్ మీడియా హోరెత్తింది. పిచ్చెక్కిందా లేక బాగా తాగావా...  డాక్టర్ కి చూపించుకో అంటూ ఆమె ఫాలోవర్స్ బండ బూతులు తిట్టారు. ఈ రేంజులో ఆమెని ఆడుకోవడానికి సరి అయిన రీజన్ కూడా ఉంది మరి. కరోనా వైరస్ గురించి పిచ్చి పిచ్చిగా ఫన్నీగా వీడియో చేసింది. "ఢిల్లీకి, తెలంగాణకి కరోనా వైరస్ చేరిందిట. హ.. హ.. హా.. వార్తల్లో చదివాను. మరి అల్ ది బెస్ట్ మీకు... హా.. హహ్హ" ఇలా పిచ్చి పిచ్చిగా ఒక టిక్ టాక్ వీడియో చేసి షేర్ చేసింది. 

ఆ వీడియో చూసిన వెంటనే జనాలకి కోపం నషాళానికి ఎత్తింది. పచ్చి పచ్చిగా తిట్టారు. దాంతో దెబ్బకి వీడియోని డిలీట్ చేసింది. "ఇస్మార్ట్ శంకర్" హిట్ అయినప్పటినుంచి ఎప్పటికప్పుడు ఎదో ఒక వీడియో పెడుతూ హంగామా చేస్తోంది. అయితే అవన్నీ ఆమె వ్యక్తిగతం కాబట్టి ఎవరూ తప్పు పట్టలేదు. కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి గురించి ఫన్ చేస్తూ వీడియో పెట్టడంతో జనాలు సైలెంట్ గా ఉండలేక పోయారు.