కమ్ముల రూటు మార్చాడా?

Has Sekhar Kammula changed his track?
Wednesday, December 4, 2019 - 22:00

శేఖర్  కమ్ముల సినిమాల్లో హీరో ఉంటాడు. కానీ ఇంపార్టెన్స్ మాత్రం హీరోయిన్ కే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే డామినేషన్ మొత్తం హీరోయిన్ దే. ఆనంద్ లో రూప క్యారెక్టర్ నుంచి ఫిదాలో భానుమతి పాత్ర వరకు ఎక్కడ చూసినా హీరోయిన్లదే డామినేషన్. అయితే ఈ ఫార్మాట్ నుంచి కమ్ముల కాస్త పక్కకొచ్చినట్టు కనిపిస్తోంది.

తన కొత్త సినిమాలో హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కమ్ముల. కేవలం యూనిట్ సభ్యులే కాదు, స్వయంగా కమ్ముల కూడా ఇదే విషయం చెబుతున్నాడు. తమ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ చాలా బాగుంటుందని, సినిమా మొత్తం అతడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని అంటున్నాడు. అందుకే రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ది వరల్డ్ ఆఫ్ నాగచైతన్య అని చెప్పుకొచ్చాడు.

సో.. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ శేఖర్ కమ్ముల హీరో సెంట్రిక్ మూవీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలా అని సినిమాలో హీరోయిన్ ను తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే, అక్కడున్నది సాయిపల్లవి. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే అస్సలు ఒప్పుకోదు ఈ నేచురల్ బ్యూటీ.

సో.. ఈసారి సిల్వర్ స్క్రీన్ పై చైతూ డామినేషన్ ఉంటుందా లేదా సాయిపల్లవి మెస్మరైజ్ చేస్తుందా అనే డిస్కషన్ ఇప్పట్నుంచే మొదలైంది. అన్నట్టు ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నారు, ఉగాదికి రిలీజ్ చేయాలనేది ప్లాన్.