శ‌ర్వానంద్ జోరు...డ‌బ్బే కార‌ణ‌మా?

Has Sharwanand really become greedy?
Monday, November 27, 2017 - 22:30

టాలీవుడ్‌లో స్లో అండ్ స్ట‌డీ పాల‌సీని న‌మ్ముకొని మంచి స్టార్‌గా ఎదిగిన హీరో ఎవ‌రంటే శ‌ర్వానంద్‌. వివాద‌ర‌హితుడిగా, టాలెంటే పెట్టుబ‌డిగా నిల‌బ‌డ్డాడు. శ‌ర్వానంద్ స‌డెన్‌గా జోరు పెంచ‌డం కొంద‌రి క‌నుబొమ్మ‌లు ఎగిరేలా చేసింది. నాని రూట్‌లో వెళ్తున్నాడ‌నీ, ఏడాదికి మినిమం 10 కోట్లు సంపాదించ‌డ‌మే టార్గెట్ పెట్టుకున్నాడ‌నీ ప్ర‌చారం మొద‌లైంది. 

రీసెంట్‌గా శ‌ర్వానంద్ హ‌ను రాఘ‌వ‌పూడి డైర‌క్ష‌న్‌లో సినిమా లాంచ్ చేశాడు. నాలుగు రోజుల గ్యాప్‌లోనే తాజాగా సుధీర్ వ‌ర్మ డైర‌క్ష‌న్‌లో కొత్త సినిమా ప్రారంభించాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు కొత్త సినిమాలు, వ‌చ్చే ఏడాది దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఇంకో మూవీ చేసేందుకు అంగీక‌రించ‌డంతో శ‌ర్వానంద్ జోరు పెంచిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఐతే శ‌ర్వా డ‌బ్బు సంపాద‌న కోస‌మే ఇలా గేర్ మార్చ‌లేదు.

శ‌ర్వానంద్‌కి ఈ సినిమాల‌న్నీ అనుకోకుండా కుదిరాయంతే. మ‌హానుభావుడు సినిమా విడుద‌లైన వెంట‌నే అత‌ను కేఎస్ ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో బాహుబ‌లి నిర్మాత‌ల‌కి ఒక సినిమా చేయాల‌నుకున్నాడు. చివ‌రి నిమిషంలో ఆ సినిమా అట‌కెక్క‌డంతో సుధీర్ వ‌ర్మ మూవీ ఒప్పుకున్నాడు. ఇక హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సిన నాని ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకోవ‌డంతో ఆ క‌థ ఇటు వ‌చ్చింది. అలా శ‌ర్వానంద్ హ‌ను సినిమాకి సై అనాల్సింది. ఇపుడు అనుకోకుండా దిల్‌రాజు నిర్మాణంలో మ‌రో సినిమా అత‌న్ని వ‌రిస్తోంది (ఇది ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది).

సుధీర్ వ‌ర్మ సినిమా ఏదీ ప్లాన్డ్‌గా జ‌రిగింది కాద‌ట‌. సో... అత‌ను డ‌బ్బు కోస‌మే గేర్ మార్చాడ‌నేది అబ‌ద్ద‌మ‌ని శ‌ర్వా స‌న్నిహితులు చెపుతున్నారు.