హెబ్బా గొప్పగా లేదబ్బా

Hebbah leaves no mark in Red item song
Sunday, May 17, 2020 (All day)

రీసెంట్ గా రెడ్ సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్. అందులో తను ఓ స్పెషల్ సాంగ్ చేశానని (ఐటెంసాంగ్ అంటే ఒప్పుకోవడం లేదు) అది తనకు ఎక్కడలేని పేరు తీసుకొస్తుందని చెప్పుకొచ్చింది. ఫస్ట్ టైమ్ చాలా కొత్తకొత్త స్టెప్పులు ట్రై చేశానని కూడా తెలిపింది. కట్ చేస్తే.. రిలీజైన డించక్ సాంగ్ లో రామ్ తప్ప హెబ్బా కనిపించలేదు.

విడుదలైంది చిన్న టీజరే అయినప్పటికీ అందులో తన మార్క్ చూపించాడు రామ్. 2-3 సిగ్నేచర్స్ స్టెప్స్ దించేశాడు. ఎటొచ్చి హెబ్బా పటేల్ మాత్రం తేలిపోయింది. స్టెప్పులు వేసిందా లేదా అనే సంగతి పక్కనపెడితే.. హెబ్బా లుక్ మాత్రం పూర్తిగా డల్ అయిపోయింది. ఆమెకు వేసిన కాస్ట్యూమ్స్ అస్సలు సెట్ అవ్వలేదు. దీనికి తోడు ఆమె ఫిజిక్ కు (కాస్త బొద్దుగా తయారైంది కదా) ఆ కాస్ట్యూమ్స్ అస్సలు సెట్ కాలేదు. కొన్ని ఫ్రేమ్స్ లో హెబ్బా స్టెప్పులేస్తుంటే.. ఆమె పొట్ట ఎబ్బెట్టుగా పైకి కనిపించింది.

కొన్ని సెకెన్ల టీజర్ కే హెబ్బా ఇంత ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఇక సాంగ్ మొత్తం రిలీజైతే జనాలు అబ్బ.. అనడం మాట అటుంచి.. ఏంటిది హెబ్బా అంటూ రివర్స్ అవుతారేమో అనిపిస్తోంది.