ముంబైలో ఇల్లు కొన్నా: హెబ్బా ప‌టేల్‌

Hebbah Patel buys a house in Mumbai
Wednesday, November 1, 2017 - 23:00

హెబ్బా ప‌టేల్ ఇక సినిమాలు త‌గ్గిస్తుంద‌ట‌. అంటే ఇపుడు బాగా బిజీగా ఉంద‌ని కాదు కానీ మ‌ళ్లీ న‌టిగా జోరు పెంచేముందు కొంత బ్రేక్ తీసుకుంటుంద‌ట‌. ఆమె న‌టించిన కొత్త  చిత్రం "ఏంజెల్" నవంబర్ 3న విడుదలవుతున్న నేపథ్యంలో హెబ్బా పటేల్ విలేకరులతో ముచ్చటించింది.

"కుమారి 21ఎఫ్ సినిమా తరువాత మరోసారి టైటిల‌ రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను, ఈ చిత్రంలో నా పాత్ర ఏంజిల్‌. అంద‌రూ  అలానే పిలుస్తుంటారు. దివి నుంచి దిగివచ్చిన నాకు హీరో కు పరిచయం ఎలా అవుతుంది? దివి నుంచి దిగికు ఎలా వచ్చాను అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్," అంటోంది ఈ భామ‌. 

ఈ సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత గ్యాప్ తీసుకుంటాన‌ని చెప్పింది.  "ఏడాదిన్న‌ర‌గా వరుస సినిమాలతో షూటింగ్స్ తో బిజీ గా గడిపాను. అందుకే కొంత కాలం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ముంబయ్ లో ఇల్లు కొన్నాం అక్కడే వాటి పనులు చూస్తూ అక్కడే కొంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సినిమా బిజీ లో పడి నా గురుంచి పట్టించుకోవడం మానేశా. సో...రెస్ట్ కావాలి అనుకుంటున్నాను. చిన్న గ్యాప్ కోసమే ప్రస్తుతానికి ఏ సినిమా లను అంగీకరించడం లేదు," అని చెప్పింది ఈ ఏంజిల్‌.