వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హాట్ బ్యూటీ

Hebbah Patel to join Bigg Boss 3?
Wednesday, August 7, 2019 - 08:15

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే అందమైన భామల్ని ఊహించుకుంటారు ఎవరైనా. బిగ్ బాస్ గత రెండు సీజన్లలో అదే జరిగింది. ముద్దుగుమ్మలు హౌజ్ ను వేడెక్కించారు. హౌజ్లో ఏకంగా బికినీ షో కూడా చూపించారు గతంలో. ఈసారి కూడా అలాంటి హంగామా ఉంటుందనుకున్న ఆడియన్స్ కు షాకిచ్చారు స్టార్ మా యాజమాన్యం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ట్రాన్స్ జెండర్ తమన్న సింహాద్రిని హౌజ్ లోకి పంపించారు. 

తమన్న రాకతో చాలామంది కుర్రాళ్లు డిసప్పాయింట్ అయ్యారు. దీనికి తోడు హౌజ్ లో తమన్న పెర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో మొత్తానికే మోసం వచ్చింది. ఈ నేపథ్యంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరనే ఆసక్తి అందర్లో ఉంది. ఈ లిస్ట్ లో ఈసారి హెబ్బా పటేల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. సెకెండ్ వైల్డ్ కార్డ్ ఎoట్రీగా ఈమెనే హౌజ్ లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

నిజానికి ఈ లిస్ట్ లో మొన్నటివరకు శ్రద్ధాదాస్ పేరు వినిపించింది. కానీ తను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడం లేదని స్వయంగా ప్రకటించి చేతులుదులుపుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు హెబ్బా పటేల్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె దీనిపై ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఏం జరుగుతుందో చూడాలి. 

ప్రస్తుతానికైతే హెబ్బా పటేల్ ఖాళీగానే ఉంది. చేతిలో ఉన్న ఒక్క సినిమాను ఆమె పూర్తిచేసింది. ఈ వీకెండ్ తమన్న ఎలిమినేట్ అవ్వడం ఖాయమని దాదాపు తేలిపోయింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ లో  ఎక్కువమంది తమన్నాకే ఓటేశారు. సో.. హెబ్బా పటేల్ ఎంట్రీ ఉందా లేదా అనే విషయం ఈ వీకెండ్ తేలే అవకాశం ఉంది,