అబ్బా అనిపించిన హెబ్బా

Hebbah's surprise appearance in Bheeshma
Friday, February 21, 2020 - 21:30

కొన్ని సినిమాల్లో ఊహించని సర్ ప్రైజెస్ ఉంటాయి. మేకర్స్ కావాలనే వాటిని సీక్రెట్ గా ఉంచుతారు. మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు అది చూసి థ్రిల్ ఫీలవుతారని వాళ్ల ఆలోచన. రిలీజైన భీష్మ సినిమాలో కూడా అలాంటి స్వీట్ సర్ ప్రైజ్ ఉంది. ఆ సర్ ప్రైజ్ పేరు హెబ్బా పటేల్. అవును.. భీష్మ సినిమాలో హెబ్బా పటేల్ ఉంది. నిజానికి సినిమాలో రష్మిక ఎంట్రన్స్ కంటే ముందే హెబ్బా పటేల్ వస్తుంది. స్టార్టింగ్ లో ఒక నిమిషం పాటు అలా కనువిందు చేసి (నిజంగానే కన్నులవిందు) చేసి వెళ్లిపోతుంది. హెబ్బాను చూసిన ప్రేక్షకులు నిజంగానే షాక్ అయ్యారు.

అయితే ఈ ఎప్పీయరెన్స్ అప్పటితో ముగిసిపోలేదు. ఆశ్చర్యంగా క్లైమాక్స్ లో కూడా ఈమె కనిపించింది. అలా హెబ్బాను కేవలం గెస్ట్ రోల్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. క్లైమాక్స్ లోని కీలకమైన ఎపిసోడ్ లో కూడా చూపించి... దర్శకుడు తన చాతుర్యాన్ని ప్రదర్శించారు.

కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ హెబ్బా మాత్రం అబ్బా అనిపించింది. తన క్లీవేజ్ షోతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆమె అందాలు ఘాటుపుట్టించాయంటే నమ్మండి.