నేను రాను బిడ్డో షూటింగ్ కి

Hero refuses to resume shooting as corona cases are growing
Monday, June 1, 2020 - 08:45

"నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు" అని "నేటి భారతం"లో ఒక సాంగ్ ఉంది. ఆనాటి ప్రభుత్వ వైద్య సదుపాయాల దుస్థితికి అద్ధం పట్టింది ఆ పాట. ఇప్పుడు షూటింగ్ లకి రాను అంటూ ఇలాగే సాంగ్ వేసుకుంటున్నాడు ఓ హీరో. కరోనా ఇప్పట్లో పోయేది కాదు... దాంతో కలిసి జీవించాలి అని ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో మూవీ ఇండస్ట్రీ కూడా షూటింగ్ లకి రెడీ అవుతోంది. "ఆర్.అర్.ఆర్", "ఆచార్య" వంటి బడా సినిమాలు షూటింగ్ లకు సిద్ధం అవుతున్నాయి. ఐతే ఒక హీరో... మాత్రం రాను రాను అంటున్నాడట. ఈయన నటిస్తున్న సినిమా లాక్డౌన్ కి ముందు చిన్న షెడ్యూలు ని పూర్తి చేసుకొంది.

అసలు షూటింగ్ ఇప్పుడు మొదలు పెడదామని డైరక్టర్ అడిగితే.... వద్దులెండి.. ఇంకొంత కాలం ఆగుదామని చెప్తున్నాడు అంట.

"కరోనా కేసులు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఈ టైంలో రిస్క్ అవసరమా... షూటింగ్ తొందరగా మొదలుపెట్టాల్సిన అవసరం ఏముంది. ఎలాగు వచ్చే ఏడాది ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమాకి ఏమిటా తొందర?" అంటూ డైరక్టర్ కి, ప్రొడ్యూసర్ కి క్లాస్ పీకాడట. సో, ఈ హీరో మూవీ ఇప్పట్లో షురూ అవదు.

దాదాపుగా ఇలాంటి మాటే మరో సీనియర్ హీరో అంటున్నాడట. ఆయన అసలే అతి జాగ్రత్తపరుడు.