హీరోయిన్లలో కదలిక వచ్చింది

Heroines are donating money
Sunday, April 19, 2020 - 23:15

కరోనాతో మొత్తం స్తంభించిపోయిన వేళ.. టాలీవడ్ ప్రముఖులంతా ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ల నుంచి స్పందన లేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ముద్దుగుమ్మలు ఇప్పుడిప్పుడే కదులుతున్నారు. మొన్నటికిమొన్న చిరంజీవి నేతృత్వంలో నడుస్తున్న సీసీసీకి 2 లక్షలు విరాళం అందించింది కాజల్. ఇప్పుడు తమన్నా వంతొచ్చింది. కాజల్ డొనేషన్ ఇవ్వడంతో తమన్న కూడా ముందుకొచ్చింది. సీసీసీకి తనవంతుగా 3 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.

కాజల్, తమన్న బాటలో మరింతమంది హీరోయిన్లు ముందుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నిజానికి కాజల్, తమన్న కంటే కొంతమంది హీరోయిన్లు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. అందరికంటే ముందు ప్రణీత తన వంతుగా లక్ష రూపాయలు ప్రకటించింది. 50 కుటుంబాల్ని ఆదుకుంటానని తెలిపింది. లావణ్య త్రిపాఠి కూడా ఆర్థిక సాయం అందించింది. లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. 

ఇంకా నిద్ర లేవాల్సిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వీళ్లంతా ఎప్పుడు బయటకొస్తారో చూడాలి.