ఇక హీరోయిన్ల ఎంజాయిమెంట్ ఇలా

Heroines reveal their post corona crisis plans
Wednesday, June 10, 2020 - 16:30

లాక్ డౌన్ తో హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. లేదంటే షూటింగ్స్ చేస్తూనే, మధ్యమధ్యలో ఫారిన్ వెకేషన్స్, షాపింగ్స్ ఇలా చాలా ప్లాన్ చేసుకునేవాళ్లు. అలా చాలా ఎంజాయ్ మెంట్ ను మిస్సయ్యారు హీరోయిన్లు. ఇప్పటికే లాక్డౌన్ ఎత్తేశారు... కానీ ఇంకా ఎవరూ లాక్డౌన్ ఉన్నట్లే భయపడుతున్నారు. ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి. ఐతే త్వరలోనే షూటింగ్లు కూడా మొదలు కానున్నాయి. మరి షూటింగ్స్ కాకుండా, చేయబోయే తమ మొదటి పనులు చెప్పుకొచ్చారు.

పూజా హెగ్డే
షూటింగ్ షెడ్యూల్స్ చూసుకొని, ఓ 2 రోజులు గ్యాప్ దొరికితే కేరళలోని బెకల్ బీచ్ కు వెళ్తాను.

రాశిఖన్నా
షాపింగ్ బాగా మిస్సవుతున్నాను. మాల్స్ తెరిస్తే మనసారా షాపింగ్ చేయాలని ఉంది

కాజల్
వెంటనే "ఆచార్య" షూటింగ్ కు వెళ్లాలి. ఆ తర్వాత ఇండియాలోనే ఏదైనా వెకేషన్ ప్లాన్ చేయాలి. ఇంకా ఏం అనుకోలేదు కానీ కచ్చితంగా వెళ్తాను.

కియరా
థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మిస్సవుతున్నాను. థియేటర్లు తెరిచిన వెంటనే ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్ కు వెళ్లి సరదాగా ఏదో ఒక సినిమా చూడాలి.

లక్ష్మీరాయ్
అర్జెంట్ గా ఏదైనా పార్లర్ కు వెళ్లాలని ఉంది.

నభా నటేష్
ఓ 3 రోజులు బాగా ట్రావెల్ చేయాలని ఉంది. ఇంకా ప్లాన్ చేయలేదు. చూద్దాం.

తాప్సి
అర్జెంట్ గా ఏదైనా జపనీస్ రెస్పారెంట్ కు వెళ్లాలి. జపనీస్ రుచుల్ని బాగా మిస్సవుతున్నాను.

మెహ్రీన్
వెంటనే రోడ్ ట్రిప్ కు వెళ్లాలని ఉంది. రాజస్థాన్ లో రోడ్ ట్రిప్ అంటే నాకు చాలా ఇష్టం. లడక్ కూడా ప్లాన్ చేయాలి.