మ‌న సినిమాల‌పై హీనా చీప్ కామెంట్‌

Hina Khan's cheap remark about south heroines raises controversy
Thursday, October 26, 2017 - 16:45

ముంబైలో హీనా ఖాన్ అని ఒక భామ ఉంది. హిందీ సీరియ‌ల్స్‌లో న‌టిస్తుంటుంది. "హే రిస్తా క్యా కెహ‌లాతా హై" అనే సీరియ‌ల్లో అక్ష‌ర పాత్ర పోషించింది. ఇప్ప‌టికే 2500 ఎపిసోడ్స్ పూర్త‌య్యాయి ఈ సాగ‌తీత సీరియ‌ల్‌లో. ఈ భామ గురించి మ‌నం ఎందుకు డిస్క‌స్ చేసుకుంటున్నామంటే..ఆమె సౌత్ సినిమాల‌పై ఒక పిచ్చి కామెంట్ చేసింది.

హీనా ఖాన్ ప్ర‌స్తుతం బిగ్‌బాస్ (హిందీ) సీజ‌న్ 11లో పార్టిసిపేట్ చేస్తోంది. అందులో సౌత్ సినిమాల గురించి ఒక కామెంట్ చేసింది.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో ఆమెని న‌టించాల‌ని కోరార‌ట‌. కానీ ఆమె ఒప్పుకోలేద‌ట‌. ఎందుకంటే ఆమెని బ‌రువు పెర‌గాల‌ని కోరాడ‌ట ద‌ర్శ‌కుడు. "సౌత్‌లో అంతే. అక్క‌డ వాళ్ళ‌కి అమ్మాయిలు బొద్దుగా ఉండాలి. మ‌న నార్త్ హీరోయిన్ల‌ను బ‌రువు పెర‌గ‌మంటారు. అందుకే రెండు సౌత్ సినిమాల‌ను రిజెక్ట్ చేశా", అని గొప్ప‌లు పోయింది ఛీ(హీ)నా.

ఇంత‌కీ ఆమెని ఏ పాత్ర‌కి అడిగారో మాత్రం చెప్ప‌లేదు. ఆ సినిమా మిస్ అయినందుకు బాధ‌ప‌డుతున్నా...కానీ బ‌రువు పెర‌గ‌డం నా వ‌ల్ల కాదు. అక్క‌డి వారికి అదేమి టేస్ట్ అన్న‌ట్లుగా మాట్లాడింది ఈ బుల్లి.

స‌మంత లావు ఉందా? కాజ‌ల్ బొద్దుగుందా? త‌మ‌న్నాని బ‌రువు పెర‌గ‌మ‌ని ఎవ‌రైనా చెప్పారో ఈ భామకే తెలియాలి. ఆమె కామెంట్‌పై మ‌న తెలుగు నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమెని ఓ ఆటాడుకుంటున్నారు.