బుల్లితెరపై అంత "హిట్" అవ్వలేదు

HIT gets average ratings on TV
Friday, May 8, 2020 - 10:00

వెండితెరపై ఓ మోస్తరుగా జనాలను అలరించిన హిట్ సినిమా.. బుల్లితెరపై కూడా దాదాపు అదే ఆదరణ దక్కించుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాలేదు. మరీ ముఖ్యంగా ఇది లాక్ డౌన్ సీజన్ కావడంతో.. హిట్ లాంటి కొత్త సినిమా పడితే రేటింగ్స్ మోత మోగిపోతుందని భావించిన మేకర్స్ కు దిమ్మ తిరిగింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా, మేడే కానుకగా ప్రైమ్ టైమ్ లో జెమినీ టీవీలో ప్రసారమైన హిట్ సినిమాకు కేవలం 5.07 టీఆర్పీ (అర్బన్+రూరల్) వచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసారమైన రాక్షసుడు, రేసుగుర్రం లాంటి సినిమాలకు హిట్ కంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది. ఉన్నంతలో అర్బన్ ఆడియన్స్ (7.23) ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. రూరల్ ప్రేక్షకులు హిట్ సినిమాను అస్సలు పట్టించుకోలేదు.

ఇక ఈ వారం స్మాల్ స్క్రీన్ పై టాప్-5 సినిమాల లిస్ట్ చూస్తే.. ఫస్ట్ ప్లేస్ లో రాక్షసుడు (6.38) నిలిచింది. రెండో స్థానంలో రెండో స్థానంలో రేసుగుర్రం (5.56), మూడో స్థానంలో ఛలో (5.09) నిలవగా.. హిట్ సినిమాకు నాలుగో స్థానం దక్కింది. ఐదోస్థానంలో కల్యాణ్ రామ్ నటించిన 118 నిలిచింది