పరశురామ్ ఇంట్లో చందు పెళ్లి

How are Chandoo Mondeti and Parasuram related?
Monday, May 18, 2020 - 15:00

పరశురామ్, చందు మొండేటి.. ఇద్దరూ టాలీవుడ్ దర్శకులు. అయితే అంతకుమించి కనెక్షన్ వీళ్లిద్దరి మధ్య ఉంది. పరశురామ్ భార్య చెల్లెల్ని (సుజాత) చందు మొండేటి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. చందు మొండేటి-సుజాత పెళ్లి సింపుల్ గా పరశురామ్ ఇంట్లోనే జరిగింది. అలా ఈ ఇద్దరు దర్శకులు బంధువులుగా మారారు.

చందు మొండేటి పెళ్లికి పరశురామ్ కారణమైతే.. చందు ఇండస్ట్రీకి రావడానికి కారణం సుకుమార్. ఆర్య టైమ్ లో అంతా సుకుమార్ గురించే మాట్లాడుకున్నారు. ప్రతి సీన్ ను చర్చించుకున్నారు. అంతా తన గురించి కూడా అలానే మాట్లాడుకోవాలనేది చందు మొండేటి కోరిక. అందుకే బీటెక్ పూర్తయిన వెంటనే సినీపరిశ్రమలోకి వచ్చేశాడు.

పరశురామ్, సుకుమార్ తర్వాత తన జీవితంలో కీలకమైన వ్యక్తిగా నిఖిల్ గురించి చెబుతాడు చందు. నిఖిల్ సినిమాతో ఇతడు దర్శకుడిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. చందు మొండేటిని చాలా సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి నిఖిల్. ఆ తర్వాత అతడే చందు మొండేటికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు.

అలా చందు-నిఖిల్ కాంబోలో కార్తికేయ రావడం, ఆ సినిమా సక్సెస్ తో చందు దర్శకుడిగా స్థిరపడిపోవడం చకచకా జరిగిపోయాయి.