రానా ఇలా ప్రపోజ్ చేశాడట

This is how Rana proposed to Miheeka
Saturday, May 23, 2020 - 13:00

టాలీవుడ్ హీరోల్లో ఒకడు. దగ్గుబాటి వారసుడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇలాంటి వ్యక్తి ఎలా లవ్ ప్రపోజ్ చేశాడనే విషయం అందరికీ ఆసక్తికరమే. అవును.. రానా-మిహికాల ప్రేమ మేటర్ బయటపడిన వెంటనే.. చాలామందికి ఇదే అనుమానం తట్టింది. మిహికాకు రానా ఎలా ప్రపోజ్ చేసి ఉంటాడోనని అంతా ఊహించుకున్నారు.

దీనిపై పెద్దగా సస్పెన్స్ మెయింటైన్ చేయలేదు రానా. మిహికాకు మొదట తనే లవ్ ప్రపోజ్ చేశానని అది కూడా చాలా సింపుల్ గా చేశానని చెప్పుకొచ్చాడు రానా. చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న మిహికాకు తన ప్రేమను వెల్లడించడం కోసం ఓ రోజంతా ఆలోచించాడట రానా. అలా ఆలోచించి, మరుసటి రోజు మిహికాకు ఫోన్ లో ప్రపోజ్ చేశాడట.

ఇలా సింపుల్ గా తన ప్రేమను ప్రపోజ్ చేసినట్టు వెల్లడించాడు రానా. మిహికా నుంచి రిప్లయ్ కూడా వెంటనే రాలేదట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నారట. ఇక అక్కడ్నుంచి తమ ప్రేమ ప్రయాణం సింపుల్ గా కొనసాగిందని చెప్పుకొచ్చాడు రానా.

ఇంట్లో కూడా తన లవ్ మేటర్ ను సింపుల్ గా 2-3 నిమిషాల్లో మొత్తం చెప్పేశానని అన్నాడు  రానా. ఎంత పెద్ద హీరోకైనా రియల్ లైఫ్ ప్రేమకథలు ఇలానే సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటాయేమో.