మహేష్‌బాబు సీఎంగా ఎలా ఉంటాడు?

దూకుడు సినిమాలో కాసేపు అలా ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించాడు మహేష్. ఆ సినిమా ఎంత హిట్టయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇక పూర్తిగా ఎమ్మెల్యేగా మారాడిపుడు. కొరటాల శివ సినిమాలో మహేష్ ఎమ్మెల్యేగా.... అనుకోకుండా ముఖ్యమంత్రి కుర్చీలో తిష్టవేసే యువకుడిగా కనిపిస్తాడట.
మరి ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ ఎలా ఉంటాడు? ఎలాంటి గెటప్‌లో కనిపిస్తాడు?
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి. అందులో మహేష్ స్టయిలీష్ యువకుడిగానే కనిపించాడు. ప్రత్యేకమైన గెటప్ కానీ, ఖద్దరు దుస్తుల్లో కానీ దర్శనమివ్వలేదు. సింపుల్ లుక్‌లోనే ఉన్నాడు. అయితే అది సీఎం గెటప్ కాదని టాక్. విడుదలకి చాలా సమయం ఉంది కాబట్టి...ఇపుడు ఆ లుక్‌ని రివీల్ చేయడం లేదు. సంక్రాంతికి ఈ సినిమా మొదటి లుక్కు తీసుకొస్తున్నారు. సీఎం కుర్చీలో దర్జాగా సిట్టింగ్ వేసే ఫోటోనే మొదటి లుక్కుగా విడుదల చేస్తారట.
భరత్ అనే నేను సినిమాకి శ్రీహరి నాను అనే దర్శకుడు కథ అందించాడు. ఆ కథని చాలా రసవత్తరంగా తన శైలిలో మార్చుకున్నాడట దర్శకుడు కొరటాల. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు సినిమాలో పలు ఎపిసోడులు ప్రేక్షకులను థ్రిల్లుకి గురి చేస్తాయని అంటున్నారు. మహేష్‌బాబు అభిమానులు ఈ సినిమా విజయంపై పూర్తి భరోసాతో ఉండొచ్చట.
- Log in to post comments