కరోనా కలిపింది ఇద్దరినీ

Hrithik and wife unite again due to corona
Thursday, March 26, 2020 - 12:30

నువ్వా దరిని, నేనీ దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే లిరిక్స్ తో పాపులర్ సాంగ్ ఒకటి ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి కృష్ణమ్మ స్థానంలో కరోనా పదాన్ని పెట్టి పాట పాడుకుంటున్నాడు హృతిక్ రోషన్. అవును.. ఎన్నో ఏళ్ల కిందట విడిపోయిన  భార్య, ఈ కరోనా కారణంగా మళ్లీ హృతిక్ ఇంటికొచ్చింది. 

ఇంతకీ మేటర్ ఏంటంటే.. దాదాపు ఆరేళ్ల కిందటే హృతిక్-సుజేన్ విడిపోయారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఒప్పందం ప్రకారం.. కొన్ని రోజులు హృతిక్ వద్ద, మరికొన్ని రోజులు సుజేన్ వద్ద పిల్లలు ఉంటారు. ఈ క్రమంలో హృతిక్ ఇంటికి ఇద్దరు పిల్లలు రావడం, అదే టైమ్ లో కరోనా వచ్చి లాక్ డౌన్ ప్రకటించడం చకచకా జరిగిపోయింది.

21 రోజుల పాటు లాక్ డౌన్ ఉండడంతో పిల్లల్ని చూడకుండా ఉండలేకపోయింది సుజేన్. పైగా ఇది కరోనా టైమ్. పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఏకంగా బట్టలు సర్దుకొని హృతిక్ ఇంటికి వచ్చేసింది. ప్రస్తుతం హృతిక్-సుజేన్ కలిసే ఉంటున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ వెల్లడించాడు. ఈ క్లిష్ట సమయంలో పిల్లలకు అండగా నిలిచిన సుజేన్ కు థ్యాంక్స్ చెప్పాడు. తన ఇంట్లో కాఫీ తాగుతున్న తన మాజీ భార్య ఫొటోను కూడా షేర్ చేశాడు.