ఇక మ‌ల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫ్రీ

Hyderabad: Parking free in Hyderabad multiplexes
Tuesday, March 20, 2018 - 23:30

హైద‌రాబాద్ వాసుల‌కి గుడ్ న్యూస్ ఇది. ఇక‌పై మ‌ల్టీప్లెక్స్‌ల్లో, మాల్స్‌లో పార్కింగ్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... అవును..ఇది నిజ్జంగా నిజం. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమ‌ల్లోకి తీసుకురానుంది జీఎచ్ఎంసీ . 

మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్‌ల్లోపార్కింగ్ పేరుతో దారుణంగా దోచుకుంటున్నార‌నే ఫీలింగ్ అంద‌రిలో ఉంది. వీటిపై ఫిర్యాదులు అధికంగా రావ‌డంతో ప్ర‌భుత్వం వెంట‌నే సెట్ చేసింది. మొద‌టి గంట అన్నిచోట్లా ఉచిత‌మే. ఆ త‌ర్వాత కూడా టికెట్ కొన్న‌ట్లుగా చూపితే.. ఉచిత‌మే. టికెట్ కొన‌కుండా, షాపింగ్ చేయ‌కుండా..గంటకి పైగా ఉంటే మాత్రం పార్కింగ్ ఫీ ప‌డుతుంది.

ఇదే చేత్తో.. వాటర్ బాటిల్స్‌, టీ, కాఫీ రేట్ల‌ని కూడా ఎం.ఆర్‌.పికి మించ‌కుండా అమ్మ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటే బెట‌ర్‌. వాటర్ బాటిల్స్‌ని 80, 100 రూపాయ‌ల‌కి అమ్మే మ‌ల్టీప్లెక్స్‌ల‌పై వెంట‌నే లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాలి.