హైపర్ ఆదికి కరోనా? నిజమేనా?

Hyper Aadhi and corona rumors
Tuesday, July 7, 2020 - 14:30

జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయినవాళ్ళల్లో హైపర్ అది ఒకరు. కమెడియన్ గా సినిమాల్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు. బాగా క్రేజ్ ఉన్న బుల్లితెర  నటుడు హైపర్ ఆది. అతనికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమేనా అంటూ ఆదికి తెగ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట.

కానీ ఇది కూడా రూమరే అని తేలింది. ఆ మధ్య టీవీ యాంకర్ ఓంకార్ కి కూడా కరోనా పాజిటివ్ అని ప్రచారం జరిగింది. ఇది అంతే.....  నిజం కాదు.

వాస్తవం ఏంటంటే..... హైపర్ అది కామెడీ స్కిట్ టీంలో ఒక సభ్యుడికి కరోనా అనుమానంతో ఐసొలేషన్ లో ఉంచారు. అతని రిజల్ట్ ఇంకా తేలలేదు. ఆ టీం మెంబర్ కి అనుమానం కలిగితే... ఆదికి కరోనా వచ్చినట్లు  ప్రచారం మొదలైంది. 

ఇప్పటికే నవ్య స్వామి, రవి, బొడ్డు ప్రభాకర్ అనే టీవీ ఆర్టిస్టులు కరోనాబారిన పడ్డారు. ఝాన్సీ కూడా అనుమానంతో ఐసోలేషన్ లో ఉంది.