వకీల్ సాబ్ లో నేను లేను

Hyper Aadhi gives clarity on Vakeel Saab
Wednesday, July 8, 2020 - 10:15

పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో ఒకడు హైపర్ ఆది. జనసేన యాక్టివ్ మెంబర్ కూడా. ఓవైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా కమెడియన్ గా రాణిస్తున్నాడు. పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో కూడా ఈ హాస్యనటుడు ఉన్నాడనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. దీనిపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు.

"వకీల్ సాబ్ సినిమాలో నేను లేను. ఎందుకు లేనంటే నా దగ్గర సమాధానం లేదు. సర్ ప్రైజ్ కోసం నా పాత్రను సీక్రెట్ గా ఉంచారని అనుకుంటున్నారు చాలామంది. అలాంటిదేం లేదు. అయినా వకీల్ సాబ్ సినిమాలో నేను ఉన్నానా లేదా అనేది టాపిక్ కాదు. ఆ సినిమా చాలా బాగా వస్తోందని నాకు తెలుసు. పవన్ స్టామినాకు తగ్గట్టు వకీల్ సాబ్ ఉంటుంది. కచ్చితంగా ఇదే రీఎంట్రీ మూవీ."

ఇలా వకీల్ సాబ్ లో తను లేననే విషయాన్ని బయటపెట్టాడు హైపర్ ఆది. పవన్ నుంచి తనకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రశంసలు లేవంటున్నాడు ఆది. వర్క్ బాగా చేస్తే బాగా చేశావని మాత్రమే అంటారని, అదే తనకు చాలా ఎక్కువని చెబుతున్నాడు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.