ప్ర‌భాస్‌ని బ్ర‌ద‌ర్ అనలేను క‌దా!

I can't call him as brother, says Anyushka about Prabhas!
Thursday, January 18, 2018 - 14:45

"అనుష్కతో పెళ్లి లేదు. మా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌బంధం కూడా లేద‌,"ని ఇప్ప‌టికే ప్ర‌భాస్ కుండ‌బ‌ద్దలు కొట్టాడు. వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబుతున్నార‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో వాటిపై రీసెంట్‌గా ప్ర‌భాస్ క్లారిఫికేష‌న్ ఇచ్చాడు. ఇపుడు అనుష్క కూడా ఈ విష‌యంలో స్పందించింది.

"మీడియా ఈ మ‌ధ్య న‌న్ను అడిగే మాట‌లు రెండే. ఒక‌టి బ‌రువు. రెండోది పెళ్లి. పెళ్లి గురించి ఆలోచ‌న‌లేదిపుడు," అని అనుష్క తాజాగా మీడియాతో మాటామంతీలో చెప్పింది. "భాగ‌మ‌తి" ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌మిళ మీడియాతో ముచ్చ‌టించింది. నాక‌న్నా మీడియానే ఎక్కువ‌గా పెళ్లి గురించి ఆలోచిస్తుంద‌ని కూడా కొంటెగా స‌మాధానం ఇచ్చింది స్వీటీ.

ఇక అస‌లు విష‌యానికొస్తే ప్ర‌భాస్‌తో పెళ్లి లేద‌ని కూడా చెప్పింది.

"ప్ర‌భాస్‌ నాకు క్లోజ్ ఫ్రెండ్‌. నాకున్న మంచి స్నేహితుల్లో ఒక‌డు. ఇద్ద‌రం చాలా క్లోజ్‌గా ఉంటాం. సో మా మ‌ధ్య ఏదో ఉంద‌ని అనుకోవ‌డం స‌హ‌జం. ఐతే ప్ర‌భాస్ నాకు బాయ్‌ఫ్రెండ్ కాదు. మా మ‌ధ్య చాలా మంచి అనుబంధం ఉంది కానీ దానికి ఒక పేరు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది. ప్ర‌భాస్‌ని బ్ర‌ద‌ర్ అని అయితే అన‌లేను క‌దా," అని మ‌రింత గ‌డుసుగా స‌మాధానం ఇచ్చింది.