నన్ను పాగల్ అంటారని తెలుసు

I knew people would call me Paagal, Vishwak Sen
Thursday, March 19, 2020 - 21:00

కరోనా దెబ్బకు ఇండస్ట్రీ అంతా కుదేలైంది. అంతా ఇంట్లో కూర్చున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అయ్యాయి. ఇలాంటి టైమ్ లో తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు విశ్వక్ సేన్. కరోనా టైమ్ లో "పాగల్" టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసిన విశ్వక్... అంతా తనను పాగల్ అంటారని తనకు తెలుసని, కానీ మంచి ముహూర్తం కావడంతో కరోనా టైమ్ లో కూడా ఓపెనింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

అయితే ఇది కేవలం ఓపెనింగ్ మాత్రమే అంటున్నాడు విశ్వక్. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. 
ఈ ఓపెనింగ్ కు రానా, దిల్ రాజు, జెమినీ కిరణ్, త్రినాథరావు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఎవ్వరూ ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అంతా సంప్రదాయబద్ధంగా నమస్కారాలు పెట్టుకున్నారు. రానా అయితే ఆర్మీ స్టయిల్ లో అందరికీ సెల్యూట్ చేసుకుంటూ వెళ్లిపోయాడు.