చైత‌న్య మొబైల్ చెక్ చేయ‌ను: స‌మంత‌

I never check Chaitanya's mobile phone, says Samantha
Monday, July 17, 2017 - 13:45

ప్రేమలో ప్రేమ మాత్రమే ఉండాలి. ఎలాంటి అనుమానాలు, స్వార్థం ఉండకూడదు. సమంత చెబుతున్న ప్రేమ సూక్తులివి.

తన కాబోయే భర్త నాగచైతన్య మొబైల్ ను తను ఎప్పుడూ చెక్ చేయనని అంటోంది. ప్రేమికులు ఎప్పుడూ ఒకరి మొబైల్స్ మరొకరు చెక్ చేసుకోకూడదని అంటోంది. చైతూతో తనుకున్న క్లోజ్ రిలేషన్ గురించి మరికొన్ని సంగతుల్ని అభిమానులతో పంచుకుంది సమంత.

ప్రేమించుకున్న కొత్తలో ఏవేవో మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు మాత్రం ఎక్కువగా డిన్నర్ లో ఏం తిందాం అనే అంశంపైనే ఎక్కువగా మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది సమంత. జనాల దృష్టిలో తామింకా పెళ్లి చేసుకోలేదని.. అయితే మానసికంగా నాగచైతన్యతో తనకు ఎప్పుడో పెళ్లయిపోయిందంటోంది సమంత.

పెళ్లి తర్వాత నాగచైతన్యతో కలిసి కచ్చితంగా ఓ సినిమా చేస్తానని అంటోంది సమంత.