రష్మీ నా గుండెల్లో ఉంది: సుధీర్

I like Rashmi no matter what, says Sudheer
Thursday, December 12, 2019 - 13:45

యాంకర్ రష్మీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్. తమది కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి  ఎఫైర్, లవ్ స్టోరీలు లేవని స్పష్టం చేశాడు. అయితే రష్మీ అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు సుధీర్.

"నాకు, రష్మీకి మధ్య రియల్ గా ఏం లేదు. కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే. తెరపై ఇద్దరం అలా క్లోజ్ గా కనిపిస్తాం. ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్లది. ఏడేళ్ల నుంచి రష్మీ అలవాటైంది. అప్పట్లో ఒకటే షో ఉండేది. రష్మీపై పంచ్ లేస్తే ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత ఢీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అలా రష్మి-నేను ఆన్-స్క్రీన్ చాలా కలిసిపోయాం."

రీసెంట్ గా రష్మీ గురించి కొన్ని విషయాలు తెలిశాయంటున్నాడు సుధీర్. "చాలా చూసి, చాలా స్ట్రగుల్ అయి వచ్చింది రష్మీ. రీసెంట్ గా రష్మీ గురించి కొన్ని విషయాలు తెలిశాయి. అవి తెలిసిన తర్వాత అప్పటివరకు ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఆ విషయం తనకు కూడా చెప్పాను. రీసెంట్ గా ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఇష్టం కంటే రష్మీ అంటే గౌరవం పెరిగిపోయింది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం."

జబర్దస్త్ ను వదిలి వెళ్లనని కూడా స్పష్టంచేశాడు సుధీర్.. వేరే ఛానెల్ నుంచి ఆఫర్ వచ్చిందని, చేయడానికి రెడీ అవుతున్నానని, మల్లెమాల ప్రొడ్యూసర్లు వద్దంటే వందశాతం ఆగిపోతానని స్పష్టంచేశాడు..