వయసు తగ్గించొద్దన్నాను: నాగార్జున

I wanted to play my age, Nag
Monday, August 5, 2019 - 19:15

నాగార్జున వయసుపై మన్మథుడు-2 సినిమాలో చాలానే సెటైర్లు పడ్డాయి. ఎండిపోయిన చెట్టుకు నీరు పోస్తే పువ్వులు పూస్తాయా అనే డైలాగ్ నాగార్జున మీదే పేలింది. ఇప్పటివరకు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు వర్జినే కదా అంటూ మరో సెటైర్ కూడా పేలింది అతడిపైన. ఇప్పుడు ఆ వయసు టాపిక్ పై మరోసారి రియాక్ట్ అయ్యాడు నాగ్. సినిమాలో తన వయసు తగ్గించే పనులు చేయొద్దని, దర్శకుడికి క్లియర్ గా చెప్పానంటున్నాడు.

"మన్మథుడు-2 స్క్రిప్ట్ సెలక్ట్ చేయడానికి కారణమే అది. కొంచెం వయసు ఎక్కువగా ఉన్న హీరో పాత్ర. ఇది రీమేక్ చేస్తే బాగుంటుందని రాహుల్ కు చెప్పాను. నా వయసు తగ్గించే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పాను. వయసు ఎక్కువగా ఉన్న హీరో, యంగ్ గా ఉండే హీరోయిన్ మధ్య నడిచే కథ ఇది. ఇలాంటి కథల్లో నా వయసు తగ్గించే పనులు పెట్టకూడదు."

దీనిపై డైరక్టర్ రాహుల్ కూడా రియాక్ట్ అయ్యాడు. నాగార్జునను యంగ్ గా చూపించే ప్రయత్నం చేయలేదని, అలాగని అతడ్ని డీ-గ్లామరైజ్డ్ చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశాడు. మన్మథుడు-2లో నాగార్జున అందంగా కనిపిస్తే అది తన తప్పుకాదంటున్నాడు. అంతేకాదు.. నాగ్ లాంటి వయసుమళ్లిన హీరో సరసన రకుల్ లాంటి యంగ్ బ్యూటీని పెట్టడానికి కారణం కూడా కథ అంటున్నాడు. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వయసురీత్యా చాలా తేడా ఉండాలని, అందుకే రకుల్ ను సెలక్ట్ చేశామని చెబుతున్నాడు.