పవన్ తో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను

I will not miss the chance of acting with Pawan, says Nikhil
Tuesday, November 19, 2019 - 08:45

హీరోయిన్లకే కాదు, హీరోలకు కూడా పవన్ కల్యాణ్ తో నటించాలని ఉంటుంది. పవర్ స్టార్ తో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కలలుకనే హీరోలు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో నిఖిల్ కూడా ఉన్నాడు. పవన్ తో కలిసి నటించడం ఇతడికి ఎంత ఇష్టం అంటే, అవసరమైతే తన సినిమాను రద్దు చేసుకుంటానని అంటున్నాడు.

"పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం వస్తే నా సినిమాను కాన్సిల్ చేసుకోవడానికి కూడా రెడీ. అలా చేయడం వల్ల నా నిర్మాతకు నష్టం వస్తుందని తెలుసు. ఆ నష్టాన్ని కూడా నేనే భరిస్తాను. కానీ పవన్ తో కలిసి నటించే ఛాన్స్ ను మాత్రం వదులుకోను."

ఇలా పవన్ పై తన ఇష్టాన్ని బయటపెట్టాడు నిఖిల్. 

అదే సమయంలో మెగాస్టార్ పై ఉన్న ప్రేమను కూడా చూపించాను. అలియాభట్ తో సినిమా, మెగాస్టార్ ను కలిసే ఛాన్స్ ఒకేసారి వస్తే.. నిస్సందేహంగా అలియాభట్ తో సినిమా చేసే ఛాన్స్ ను సైతం వదులుకుంటానని అంటున్నాడు.