త్రివిక్రమ్ వ‌ల్లే వెళ్లా: ఇలియానా

Ileana reveals a secret about Trivikram
Monday, November 12, 2018 - 23:30

తన బాలీవుడ్ డెబ్యూకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ షేర్ చేసింది ఇలియానా. తెలుగు,తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తను, బాలీవుడ్ వెళ్లడానికి త్రివిక్రమ్ ఓ కారణం అంటోంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలను బయటపెట్టింది.

"అప్పుడు నేను జులాయి సినిమా చేస్తున్నాను. అదే టైమ్ లో బర్ఫీ ఆఫర్ వచ్చింది. క్యారెక్టర్ చాలా బాగుంది. చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నేను నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదు. అందుకే సినిమా పరిజ్ఞానం బాగా ఉన్న త్రివిక్రమ్ వద్దకు వెళ్లాను. స్టోరీ మొత్తం చెప్పాను. చేయాలా వద్దా అని అడిగాను. బాలీవుడ్ కు వెళ్లి బర్ఫీ చేయమని త్రివిక్రమ్ చెప్పారు. వెంటనే బర్ఫీ మూవీకి ఓకే చెప్పేశా."

ఇలా తను బర్ఫీ సినిమా చేయడానికి, బాలీవుడ్ లోకి వెళ్లడానికి త్రివిక్రమ్ కూడా కారణం అంటోంది ఇలియానా. ఆరోజు త్రివిక్రమ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే తను బాలీవుడ్ కు వెళ్లగలిగానని, అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోగలిగానని అంటోంది. 

ఇక టాలీవుడ్ లో రీఎంట్రీపై స్పందిస్తూ.. ఇదేదో తనకు యాదృచ్ఛికంగా వచ్చిన ఆఫర్ కాదంటోంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కంటే ముందు ఐటెంసాంగ్ ఆఫర్లు, పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు వచ్చాయని, కేవలం పాత్రలు నచ్చక చేయలేదని తెలిపింది. ఇప్పటివరకు టచ్ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ కావడంతో అమర్ అక్బర్ ఆంటోనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, అంతేతప్ప వచ్చిందే అవకాశమంటూ టాలీవుడ్ లోకి మళ్లీ రాలేదంటోంది.