ఆ లిస్ట్ లో 9వ స్థానం సాహోదే

IMDB announces top movies of 2019
Thursday, December 12, 2019 - 23:00

ప్రతి ఏటా ఉత్తమ చిత్రాల జాబితా ప్రకటిస్తుంది IMDB. ఇది ప్రకటించే సినిమాల లిస్ట్ కు ప్రామాణికత ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా బెస్ట్ సినిమాల లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎమ్డీబీ. ఓట్లు ఆధారంగా టాప్-10 సినిమాల్ని రిలీజ్ చేయగా.. అందులో యూరి మూవీ నంబర్-1 స్థానంలో నిలిచింది. ప్రభాస్ నటించిన సాహో సినిమాకు లిస్ట్ లో 9వ స్థానం దక్కింది.

విక్కీ కౌశల్ నటించిన యూరీ సినిమా అత్యధిక రేటింగ్స్ సాధించడంతో పాటు.. ఎక్కువమంది విమర్శకులు మెచ్చుకున్న చిత్రంగా నిలిచింది. దీంతో ఆటోమేటిగ్గా ఈ సినిమాకు IMDBలో మొదటి స్థానం దక్కింది. ఇక రెండో స్థానంలో గల్లీ బాయ్ నిలిచింది. మూడో స్థానంలో కబీర్ సింగ్, నాలుగో స్థానంలో భారత్, ఐదో స్థానంలో బద్లా సినిమాలు నిలిచాయి. 

ప్రభాస్ నటించిన సాహో సినిమా ఓట్ల పరంగా 9వ స్థానంలో, హృతిక్ చేసిన వార్ సినిమా 10వ స్థానంలో నిలిచాయి. రజనీకాంత్ నటించిన పేట సినిమాకు 14వ స్థానం, తాప్సి గేమ్ ఓవర్ సినిమాకు 22వ స్థానం దక్కాయి.