కల్యాణ్ రామ్ పై ఇంట్రెస్టింగ్ చర్చ

Interesting discussion about Kalyan Ram
Tuesday, January 7, 2020 - 20:00

రామ్ చరణ్ సినిమాకు చిరంజీవి గెస్ట్ గా వస్తే మజా ఏముంటుంది? మహేష్ బాబు సినిమాకు కృష్ణ లేదా సుధీర్ బాబు వస్తే కిక్ ఏముంటుంది? ఇలా ఆలోచించారు కాబట్టే కొత్త కాంబినేషన్లు వేదికపైకి వస్తున్నాయి. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను బహిరంగ సభకు ఎన్టీఆర్ వచ్చాడు. తాజాగా సరిలేరు నీకెవ్వరు మెగాసూపర్ ఈవెంట్ కు చిరంజీవి వచ్చారు. మరి కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా ఎంత మంచివాడవురా ఫంక్షన్ కు ఎవరు వస్తున్నారు? ఎప్పట్లానే రొటీన్ గా ఎన్టీఆర్ వస్తున్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న డిస్కషన్ ఇది. కల్యాణ్ రామ్ కూడా కాస్త కొత్తగా ఆలోచించి ఎన్టీఆర్ కాకుండా, బయట కాంపౌండ్ కు చెందిన హీరోను పిలిస్తే బాగుండేదనే డిస్కషన్ ఊపందుకుంది. కల్యాణ్ రామ్ పిలిస్తే ప్రభాస్ కచ్చితంగా వస్తాడు. కానీ ఆ ప్రయత్నం జరిగినట్టు కనిపించలేదు. కనీసం ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ ను పిలిచినా ఆర్-ఆర్-ఆర్ కాంబో వచ్చినట్టయ్యేది.

ఈ విషయంలో ఎన్టీఆర్ ను తక్కువ చేయడానికి వీల్లేదు. ఎంత మంచివాడవురా సినిమాకు ఓ ఊపు, హైపు తీసుకొచ్చేది కచ్చితంగా ఎన్టీఆరే. క్రౌడ్ పుల్లర్ గా ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్, ఎంత మంచివాడవురా సినిమా ప్రచారానికి కచ్చితంగా హెల్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద హెవీ కాంపిటిషన్ ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ రాక, టీమ్ కు కచ్చితంగా బూస్టప్ ఇస్తుంది. కాకపోతే కాస్త కొత్తగా ఆలోచించి ఉంటే బాగుండేదనేది నెటిజన్ల అభిప్రాయం.