ప్రదీప్ కేసులో ఒక ఐరనీ!

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యాంకర్ ప్రదీప్ పట్టుబడడంలో ఒక ఐరనీ ఉంది. కొంచెం టచ్‌లో ఉంటే చెపుతా అనే టీవీ షోతో పాపులరయిన ప్రదీప్‌ని... కొంచెం ఊదితే చెపుతామని హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి కేసుల్లో పట్టుబడడం ఇది కొత్తమీ కాదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం దాగి ఉంది.
తాగి డ్రైవ్ చేయకూడదని నెల రోజుల క్రితం ప్రదీప్ ఒక సందేశాత్మక వీడియో చేశాడు. ఆ వీడియోలో ధరించిన డ్రెస్సు..ఇపుడు పట్టుబడ్డప్పటి డ్రెస్సు కూడా సేమే అని సోషల్ మీడియాలో కౌంటర్‌లు పడుతున్నాయి. సోషల్ మీడియా ట్రాలర్స్ నిశిత దృష్టి ఎలా ఉందో చూడండి. ఆల్కహాల్ తీసుకొని వాహనాలు నడపొద్దనే మంచి సందేశాన్ని ఇచ్చిన సెలబ్రిటీనే తాగి డ్రైవ్ చేసి పట్టుబడడం ఒక వైచిత్రి. అదే డ్రెస్సులోనే పట్టుబడడం మరింత ఐరనీ.
ఎవరి ఖర్మ ఎలా తగలడుతుందో ఎవరూ చెప్పలేరనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్.
- Log in to post comments