ఈవారం కూడా ఇస్మార్ట్ దే

iSmart Shankar continuous to gain TRPs
Friday, November 29, 2019 - 15:15

కొత్త సినిమాల హంగామా లేకపోవడం, బుల్లితెరపై ఇస్మార్ట్ శంకర్ ఫీవర్ ఇంకా నడుస్తుండడంతో.. ఈసారి రేటింగ్స్ లో కూడా ఈ సినిమా డామినేషనే నడిచింది. మొదటిసారి ప్రసారం చేసినప్పుడు అర్బన్ లో 19 టీఆర్పీతో చెలరేగిన ఇస్మార్ట్ శంకర్ కు  రెండోసారి 8.8 (అర్బన్) రేటింగ్ రావడం విశేషం.

సెకెండ్ ఎయిరింగ్ లో కూడా 8 అంటే అది పెద్ద రేటింగ్ అనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాగా బరిలోకి దిగిన రాక్షసుడి కంటే ఇస్మార్ట్ శంకర్ సినిమానే ఎక్కువ మంది చూశారు. ఈ రెండు సినిమాల్ని ఒకేసారి అటు జీ తెలుగు, ఇటు జెమినీలో ప్రసారం చేస్తే.. రాక్షసుడికి ఓవరాల్ గా 8.2 (అర్బన్+రూరల్) టీఆర్పీ వస్తే.. ఇస్మార్ట్ కు 8.3 వచ్చింది.

ఈ రెండు సినిమాలు మినహా చెప్పుకోదగ్గ మూవీస్ ఏవీ స్మాల్ స్క్రీన్ పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. వినయ విధేయ రామ, బాహుబలి-2, సీత సినిమాలు ఎప్పట్లానే తమ రేంజ్ రేటింగ్స్ తో చార్టుల్లో సత్తాచాటాయి. త్వరలోనే బుల్లితెరపైకి రాబోతున్న సాహో, సైరా సినిమాలు కొత్త రికార్డులు సృష్టిస్తాయేమో చూడాలి.