ఐటీ రైడ్స్ తర్వాత అంతా గప్ చుప్

IT Raitds and Tollywood, the after effects
Saturday, November 23, 2019 - 09:30

మొన్న జరిగిన ఐటీ రైడ్స్ తర్వాత టాలీవుడ్ మేల్కొంది. ఎప్పుడైనా ఎవరిపైన అయినా ఐటీ దాడులు జరగొచ్చు అని అర్థమైంది. 'మేము ఐటీ రాడార్లో  ఉండం' అని ఎవరూ అనుకోవడానికి వీల్లేదు. దాంతో... ఇప్పుడు సెలెబ్రిటీలు అంతా ఇంట్లో, ఆఫీసుల్లో దాచుకోవడం మానేశారు. గత రెండు రోజుల్లోనే చాలామంది సెలెబ్రిటీలు అన్నీ సర్దేశారు.

వెంకటేష్, నాని వంటి హీరోలపై దాడులు జరిగిన తర్వాత... ఎవరిపైన ఐన జరగొచ్చు అని క్లారిటీ వచ్చింది. గతంతో పోల్చితే ... ఇప్పుడు 70 నుంచి 80 శాతం అంతా వైట్ లోనే ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. బ్లాక్ మనీ చాలా తక్కువే. అయితే ... లాభాల్లో వాటా, 'ఎక్సట్రా' ఇన్ కమ్ వంటివి నగదు, నగలు రూపంలో తీసుకుంటున్నారు. అవి కూడా ఇక సమస్యలు తెస్తాయి.