జాన్ కి కూడా సాహో ఫార్ములా?

Jaan to replicate Saaho formula?
Sunday, January 5, 2020 - 16:15

'సాహో' సినిమాకు ముందుగా శంకర్-ఎహసాన్-లాయ్ ను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్లు తప్పుకున్నారు. ఆ తర్వాత ఏ ఒక్కరికో అవకాశం ఇవ్వలేదు నిర్మాతలు. పాటల్ని రకరకాల సంగీత దర్శకులకు అప్పగించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను గిబ్రాన్ తో కొట్టించారు. ఇప్పుడు జాన్ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అవుతారాట. మొదట ఈ సినిమాకి అమిత్ త్రివేదిని తీసుకున్నారు. సైరా సినిమాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది స్థానంలో ఈ మూవీ కూడా కనీసం ముగ్గురు కంపోజర్స్ పనిచేయబోతున్నారట. 

సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకే ఇదంతా. లోకల్ గా కంపోజ్ చేసిన సాంగ్స్ బాలీవుడ్ కు నచ్చకపోవచ్చు. బాలీవుడ్ కంపోజర్స్ ఇచ్చిన ట్యూన్స్ ఇక్కడ ఎక్కకపోవచ్చు. అందుకే ఆలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు.

'జాన్'  సెకెండ్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుంది. సెట్స్ నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చి, షూటింగ్ ఊపందుకున్న తర్వాత మ్యూజిక్ గురించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దసరాకు రిలీజ్ చేయాలనేది ప్లాన్.