జాను డేట్ ఇదే

Jaanu gets release date
Wednesday, January 22, 2020 - 13:45

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం "జాను". ఈ సినిమా ప్రమోషన్ లో వెనుకబడింది. లేట్ గా మేల్కొన్న టీం ఇప్పుడు అగ్రెసివ్ గా పుష్ చేస్తోంది. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఒక తమిళ్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నామని టీం ప్రకటించింది. 

ఈ సినిమా ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. ఈ ఏడాది సమంత ఫస్ట్ రిలీజ్ ఇదే. శర్వానంద్ కి కూడా ఈ సినిమాతోనే మళ్లీ సక్సెస్ లోకి రావాలి అనే కసి ఉంది.