ఐటెంసాంగ్‌కి అంతిచ్చారా?

Jacqueline Fernandez gets heavy remuneration for bad boy
Thursday, August 22, 2019 - 19:45

బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సాహో సినిమాలో నటించింది. నటన అనడం తప్పు. షేపులు షేక్‌ చేసింది. ఆమె ఈ సినిమాలో ఐటెంగాల్‌. "బ్యాడ్‌బాయ్‌" అనే పాటలో మెరిసింది. నిజానికి జాక్వెలిన్‌ ఫస్ట్‌ చాయిస్‌ కాదు, బెస్ట్‌ చాయిస్‌ అంతకన్నా కాదు. ఇతర పేరొందిన బాలీవుడ్‌ భామలను ప్రయత్నించారు కానీ వారి డేట్‌లు కుదరలేదు. రేట్లు నచ్చలేదు.

దాంతో టిసిరీస్‌ వాళ్ల ఆలోచన ప్రకారం జాక్వెలిన్‌ని తీసుకున్నారు. ఈ ఒక్క పాటకే తనకి 2 కోట్ల రూపాయలు ఇచ్చారని జాక్వెలిన్‌ ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమెకి పెద్దగా ఆఫర్లు లేవు. క్రేజ్‌ కూడా గొప్పగా ఏమీ లేదు. ఇలాంటి టైమ్‌లో ఆమెకి 2 కోట్లు ఇవ్వడం అంటే నిర్మాతలు మరీ ముందు వెనుకా చూసుకోవడం లేదనే చెప్పాలి.

ఐతే ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి... ఈ పాటలో ఆమె స్టెప్పులు బాగానే ఉన్నాయి. బ్యాడ్‌బాయ్‌ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. తెలుగులో పాటలు పెద్దగా క్లిక్‌ కాలేదు కానీ హిందీ వెర్సన్‌కి ఇవి హెల్ప్‌ అవుతున్నాయంటున్నారు.

జాక్వెలిన్‌... శ్రీలంకకి చెందిన బ్యూటీ. సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ సినిమాల్లో నటించి పాపులర్‌ అయింది. బాలీవుడ్‌లో ఓ నిర్మాత అండదండలు ఎక్కువే అని టాక్‌.