దత్తత బాటలో శ్రీమంతుడి తండ్రి

కొరటాల శివ తీసిన శ్రీమంతుడు సినిమా దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. మూవీ కాన్సెప్ట్‌కి తగ్గట్లే హీరో మహేష్‌బాబు తన తండ్రి ఘట్టమనేని కృష్ణ జన్మించిన బుర్రిపాలెం (ఏపీ) గ్రామాన్ని దత్తత తీసుకొన్నాడు. ఆ ఊరిని ప్రగతి బాట పట్టిస్తున్నాడు. తెలంగాణలోనూ హైదరాబాద్‌కి సమీపంలోని ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఇది మహేష్‌బాబు దత్తత కార్యక్రమం.
ఇక అందులో మహేష్‌బాబుకి తండ్రిగా నటించిన జగపతిబాబు కూడా ఇదే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతున్నాడు. అయితే ఆయన ఊరిని కాదు చిన్న సినిమాని దత్తత తీసుకున్నాడు. "రచయిత" అనే చిన్న సినిమాకి పెద్ద ప్రచారం తెచ్చేందుకు ఇటీవల పాదయాత్ర చేశాడు. ఈ ఒక్క చిత్రానికే కాదు చిన్న చిత్రాలన్నింటికి తన వంతు సాయం అందిస్తానని, చిన్న చిత్రాలను దత్తత తీసుకుంటున్నా అని ప్రకటించాడు జగపతి బాబు.
ఇది అభినందించదగ్గ విషయమే. అయితే ఈ ఉత్సాహం నెక్స్ట్ సినిమా వరకు ఉంటుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.
- Log in to post comments