బాలకృష్ణ చిత్రంలో లెజెండ్ విలన్

బాలకృష్ణ హీరోగా రూపొందిన "లెజెండ్" సినిమాలో విలన్‌గా నటించడం జగపతి బాబు కెరియర్‌ని మలుపుతిప్పింది. ఇపుడు ఆయన బిజీయెస్ట్ విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. మరోసారి బాలయ్య కొత్త సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటించనున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. `జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు విలన్‌గా నటించబోతున్నారని నిర్మాత ప్రకటించారు.
చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ హిట్ కాంబోలో సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
- Log in to post comments