బిల్డర్‌కి జగపతిబాబు వార్నింగ్

తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన స్టార్స్ అంతా జూబ్లీహిల్స్‌లో ఉంటారు. కొందరు మాదాపూర్‌లో, ఇంకొందరు ఔట్‌స్కర్ట్స్‌లో ఎకరాల కొద్దీ ఉన్న విల్లాల్లో ఉంటున్నారు. కూకట్‌పల్లికి షిప్ట్ అయిన మొదటి హీరో మాత్రం జగపతిబాబే.
కేపీఎచ్‌బీ కాలనీలో లోధా సంస్థ నిర్మించిన హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల క్రితమే ఫ్లాట్ కొనుక్కొన్ని షిప్ట్ అయ్యాడు. అప్పట్లో జగపతిబాబు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇపుడు అతను సుకూన్. ఐనా అక్కడే నివాసిస్తున్నాడు. ఎందుకంటే అది లగ్జరీ ఫ్లాట్. అయితే ఈ బిల్డర్ మీద జగపతిబాబు మండిపడుతున్నాడు.
లోధా గేటెడ్ కమ్యూనిటీ హై అపార్ట్ మెంట్స్ ముంబైకి చెందిన లోధా బిల్డర్‌ది. అప్పట్లో ఆ ఏరియాలో ఇదొక్కటే హైరైజ్ అపార్ట్‌మెంట్. ఇపుడు దాని పక్కనే టాటా సంస్థ భారీ ఎత్తున ఇన్‌కార్ అపార్ట్‌మెంట్స్ కడుతోంది. అయితే పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లను కూడా తమ గేటెడ్ కమ్యూనిటీలోనే కలుపుతామని లోధా బిల్డర్ అంటున్నాడట. దాంతో జగపతిబాబుకి చిర్రెత్తుకొచ్చింది. కోట్లు పెట్టి కొన్నది ఇలా అడ్డగోలు వ్యవహారాల కోసమా అని జగపతిబాబు అంటున్నాడు.అపార్ట్ మెంట్లను గేటెడ్ కమ్యూనిటీలో కలిపితే రక్షణ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు జగపతి.
బిల్డర్ తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే ఏం చేయాలో తమకు తెలుసునని ఆయన హెచ్చరించారు.
- Log in to post comments