కూతుర్ని టాలీవుడ్ కు పంపించదట

Jahnvi Kapoor not interested to act in Telugu
Thursday, June 1, 2017 - 16:15

శ్రీదేవికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది తెలుగు సినీపరిశ్రమ. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చిందే టాలీవుడ్. అలాంటి టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలు చేసేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు శ్రీదేవి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన కూతురును కూడా ఇటువైపు చూడనీయట్లేదు. అవును.. శ్రీదేవి కూతురు జాన్వీ కూడా ఇప్పుడు బాలీవుడ్ పేరే కలవరిస్తోంది.

త్వరలోనే బాలీవుడ్ డెబ్యూకు రెడీ అవుతోంది జాన్వీ. కరణ్ జోహార్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మాతగా త్వరలోనే ఓ సినిమా రాబోతోంది. ఈ మూవీలోనే జాన్వీని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ మేరకు శ్రీదేవి-కరణ్ జోహార్ మధ్య చర్చలు ముగిశాయి. వరుణ్ ధావన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో మొదట అలియాభట్ ను తీసుకోవాలని అనుకున్నారు. తాజాగా జాన్వీ పేరు గట్టిగా వినిపిస్తోంది.

నిజానికి బాలీవుడ్ జనాలకు అవగాహన రాకముందే జాన్వీని తెలుగులోకి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. మొన్నటికి మొన్న అఖిల్ సినిమాలో కూడా జాన్వీని తీసుకుంటారంటూ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీలో కూడా శ్రీదేవి కూతురు కోసం ప్రయత్నించినట్టు పుకార్లు వచ్చాయి. అయితే భవిష్యత్తులో మాత్రం ఇలాంటి రూమర్లు రావు. ఎందుకంటే శ్రీదేవి కూతురు ఇప్పుడు బాలీవుడ్ ప్రాపర్టీ.