జులై నుంచే ప్ర‌మోష‌న్ షురూ

Jai Lava Kusa to begin its promotion from July
Wednesday, June 21, 2017 - 17:45

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జై లవకుశ' టీజర్ రెడీ అవుతోంది. వచ్చేనెల మొదటివారంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జై లవకుశ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలవకుశ సినిమా మొదట్నుంచి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం. రెండోది ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండడం. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ లో తారక్ కనిపించనున్నాడనే వార్త సినిమాపై ఇంట్రెస్ట్ ను డబుల్ చేసింది.

'జై లవకుశ' సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ లోగో, ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. టీజర్ లాంచ్ తో సినిమా ప్రమోషన్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేసినట్టు అవుతుంది. సినిమాలో నివేదా థామస్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందితా రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది.