పవన్ కళ్యాణ్ బీజేపీ దోస్తీ..ఆఫిసియల్

Jana Sena and BJP alliance is official
Thursday, January 16, 2020 - 16:45

ఫైనల్ గా ప్రకటించేశారు. బీజేపీతో జనసేన చేతులు కలిపింది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కమలం పార్టీతోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుంది జనసేన పార్టీ. అధికార వైసీపీకి చెక్ పెట్టాలంటే చేతులు కలపక తప్పదని రెండూ గ్రహించాయి. 

ఈ రోజు విజయవాడలో జనసేన, బీజేపీ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇకపై రెండు పార్టీలు కలిసే నడుస్తాయని పవన్ కళ్యాణ్, బీజేపీ స్థానిక నేతలు ప్రకటించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ ఈ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. 

ఇక పవన్ కళ్యాణ్ ... తన సినిమాల షూటింగ్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. పింక్ రీమేక్ సినిమా షూటింగ్ ఈ నెలలోనే జరుగుతుందని చాల కాలంగా ప్రచారం జరుగుతోంది.