సైనిక సంక్షేమానికి కోటి ఇచ్చిన జనసేనాని

Jana Sena President hands over Rs 1 crore to Kendriya Sainik Board
Thursday, February 20, 2020 - 22:30

సైనిక సంక్షేమానికి రూ.కోటి విరాళం అందచేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ విరాళం గతంలోనే ప్రకటించారు అయితే గురువారం కేంద్రీయ సైనిక్ బోర్డు కి వెళ్లి కోటి చెక్ ని స్వయంగా అందచేశారు.  దేశానికి సేవ చెయ్యడమే తన అంతిమ లక్ష్యం అని అన్నారు పవన్ కళ్యాణ్. సైనికులంటే ఎనలేని గౌరవం ఉందని... తన సినిమాల్లో ఎక్కువగా దేశభక్తి రేకెత్తించేలా పాటలు పెట్టాను అని చెప్పారు పవన్ కళ్యాణ్. 

రాజకీయాలలో తనది లాంగ్ మార్చ్ అని చెప్పడం విశేషం. అందుకే పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా రాజకీయ ప్రస్థానాన్ని వీడలేదని చెప్పారు. సుదీర్ఘ ప్రణాళికతో వచ్చానని, లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని అన్నారు.