ఇక పవన్ చేతిక పత్రిక

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు మీడియా విషయంలో వీక్. ఇపుడు సొంతంగా మీడియా బలాన్ని పెంచుకుంటున్నాడు. ఇప్పటికే 99 టీవీ అనే న్యూస్ ఛానెల్ జనసేన పార్టీ చేతికి చిక్కింది. అది ఇపుడు సొంత ఛానెల్ అన్నమాట. మరో రెండు చిన్న చానెల్స్ కూడా జనసేనకి ఫేవర్‌గా రెడీ అవుతున్నాయి.
తాజాగా ఒక దినపత్రిక కూడా జనసేనానికి అనుకూలంగా మారుతోంది. ఆంధ్రప్రభ పత్రిక ఇక జనసేన పత్రిక కానుంది. ఆ ఆ పత్రిక ఓనర్ ముత్తా గోపాలకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకి ప్రత్యేక స్థానం లభించనుంది. దాంతో ఆ పత్రిక ఇపుడు జనసేనకి ఫేవర్‌గా మారుతోంది. ఇకపై ఈ పత్రికనే చదవండి అంటూ జనసేన కార్యకర్తలు ఇప్పటికే మెసేజ్‌లు పంపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి ప్రధాన పత్రికలు, ప్రధాన ఛానెల్స్ అన్నీ మద్దతు ఇస్తున్నాయి. కొన్ని అయితే కరపత్రికల స్థాయికి దిగజారాయి. ఇక టీఆర్ ఎస్‌కి ఉద్యమకాలం నుంచి సొంతంగా పత్రిక, ఛానెల్ ఉన్నాయి. జగన్‌కి సొంత పత్రిక, ఛానెల్స్ ఉన్నాయి. ఇపుడు జనసేనాని అదే పంథాలో వెళ్తున్నాడు.
- Log in to post comments