హైదరాబాద్‌లో మాయావతితో పవన్ సభ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రీసెంట్‌గా తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రావారిని కొడుతున్నారని కామెంట్ చేయడం కలకలం రేపింది. ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు పవన్ కల్యాణ్ వేసిన ఎత్తుగడగా భావించి.... తెలంగాణవాదులు దీనిపై రగడ చేయలేదు.
ఐతే ఆయన ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారట. ఈ సభలో కూడా ఇదే మాటా అంటారా అనేది చూడాలి.
బీఎప్సీ అధినేత్రి మాయావతితో కలిసి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభని నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్. మరి హైదరాబాద్‌లో సభ ఎందుకు అంటే తెలంగాణలోనూ కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులు ఎంపీకి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి స్థానానికి జనసేన తెలంగాణ నాయకుడు మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలంగాణలో జనసేన పోటీ నామమాత్రమే. ఇండిపెండెంట్ క్యాండిడేచర్‌తో సమానం. బలం సున్నా.
- Log in to post comments

























