నాకు కరోనా లేదు: ఝాన్సీ

Jhansi says she has not tested positive for COVID19
Sunday, July 5, 2020 - 22:30

టీవీ ఆర్టిస్టులంతా వరుసగా కరోనా బారిన పడుతున్న వేళ.. యాంకర్ కమ్ నటి ఝాన్సీకి కూడా పాజిటివ్ వచ్చినట్టు పుకార్లు వచ్చాయి. వీటిపై ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. తను క్వారంటైన్ లో లేనని, ఐసొలేషన్ లో ఉన్నానని.. ఈ రెండింటికి చాలా తేడా ఉందని చెబుతోంది ఝాన్సీ.

హై రిస్క్ ప్రాంతాల్లో తిరిగినప్పుడు లేదా కరోనా పేషెంట్ తో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు.. తప్పనిసరిగా 10-12 రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని చెబుతోంది ఝాన్సీ. ఆ 10 రోజుల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలనే అంశాల్ని కూడా వివరంగా రాసుకొచ్చింది. అప్పటికీ అనుమానాలు ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది.

స్టార్ మా ఛానెల్ లో పరివార్ సీజన్-2 స్టార్ట్ చేసింది ఝాన్సీ. ఇందులో పాల్గొన్న కొందరికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఝాన్సీకి కూడా కరోనా సోకిందంటూ ప్రచారం మొదలైంది. అప్పట్నుంచి ఐసొలేషన్ లో ఉంటున్న ఝాన్సీ, తనకు కరోనా లేదని స్పష్టంచేసింది.