పుకార్లకు కారణం చెప్పిన యాంకర్

Jhansi's explanation about isolation
Tuesday, July 7, 2020 - 18:45

తనకు కరోనా సోకలేదని, కేవలం ఐసోలేషన్ లో మాత్రమే ఉన్నానని ప్రకటించిన యాంకర్ ఝూన్సీ, ఈసారి ఏకంగా కెమెరా ముందుకొచ్చారు. తను ఐసోలేషన్ లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో వివరించింది.

"ఎందుకు ఐసొలేషన్ అని అంతా అడుగుతున్నారు. నా షూటింగ్ సెట్ లో నేను కలిసి వర్క్ చేసిన ఇద్దరు కొలీగ్స్ కు పాజిటివ్ వచ్చింది. కాబట్టి నేను ఐసోలేషన్ లోకి వెళ్లాను. కొంతమందిలా నాకు ఏమీ కాలేదని బయట తిరగలేదు. మా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్లు నా వల్ల ప్రమాదంలో పడకూడదు. అందుకే నాకు నేనుగా హోం ఐసొలేషన్ లోకి వెళ్లాను."

ఐసోలేషన్ ముగిసిన తర్వాత లక్షణాలు బయటపడితే టెస్ట్ చేయించుకుంటానని.. ఒకవేళ పాజిటివ్ వస్తే స్వయంగా తనే చెబుతానని అంటోంది ఝాన్సీ. ఈ విషయంలో దయచేసి రూమర్స్ నమ్మొద్దని, ఏదైనా ఉంటే తనే స్వయంగా కెమెరా ముందుకొచ్చి వెల్లడిస్తానని అంటోంది.