జూలీకి నో సెన్సార్‌!

Julie 2 passes censor clearance without cuts
Tuesday, September 12, 2017 - 20:30

కుర్రాళ్ల‌కి గుడ్‌న్యూస్‌. ల‌క్ష్మీరాయ్ న‌టిస్తున్న జూలీ 2కి ఎటువంటి ఆటంకాలు లేవు. సెన్సార్ ప‌నులు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ ఈ సినిమాలో ఏ సీన్‌కి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ట‌. అంటే ఎటువంటి క‌త్తెర ప‌డ‌కుండా జూలీ 2 బ‌య‌ట‌ప‌డింది. 

ట్ర‌యిల‌ర్ చూసిన‌పుడే ఈ సినిమాలో ల‌క్ష్మీరాయ్ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో బాగా డోస్ పెంచింద‌ని అర్థ‌మైంది. అయితే రీసెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సెన్సార్ బోర్డ్ కొత్త ఛైర్మన్ ప్రసూన్ జోషి లిబ‌ర‌ల్‌గా ఉండాల‌ని సెన్సార్ స‌భ్యుల‌కి ఆదేశాలిచ్చాడ‌ట‌. దాంతో ఎటువంటి క‌ట్స్ లేకుండా జూలీ బ‌య‌ట‌ప‌డింది. అంటే ల‌క్ష్మీరాయ్ గ్లామ‌ర్ షోని ఇక ఫుల్‌గా చూడొచ్చు.